
నక్కపల్లి జిల్లావాణి ప్రతినిధి:జీవో నెంబర్ 396 కు వ్యతిరేకంగా చేస్తున్న దస్తావేజు లేఖరుల పెన్డౌన్ సమ్మె రెండో రోజు కొనసాగింది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తమ వృత్తి భద్రతను కాపాడాలి అంటూ నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని , పి పి పి విధానాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగడం వలన తమ వృత్తిని కోల్పోయి వీధిని పడే అవకాశం ఉందని , తక్షణం రద్దు చేసి లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని వారు కోరారు. తమ విధులను బహిష్కరించి పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు కొంగరచిన కృష్ణమూర్తి, అధ్యక్షుడు దాతారం మురళీకృష్ణ, కార్యదర్శి బత్తుల శ్రీను, ఉపాధ్యక్షుడు ఎన్ వి రమణ, ట్రెజరర్ లోవరత్నం, సహాయ కార్యదర్శి డిఎంపి కుమార్, రాంబాబు, సూర్యనారాయణ, బొంతు రాజు, రమేషు ,గోవిందు, వరహాలు, శేఖర్, నూకరాజు, త్రినాధ్, ముద్ద బాబ్జి, నవీన్ ,హేమంత్, లక్ష్మి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
