HomeAndhra Pradeshజడ్డంగిలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పీసా చట్టం ఉపాధ్యక్ష, కార్యదర్శి డిమాండ్

జడ్డంగిలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పీసా చట్టం ఉపాధ్యక్ష, కార్యదర్శి డిమాండ్

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామ పంచాయతీ పరిధిలోని గత కొంత కాలంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ జడ్డంగి పీసా చట్టం ఉపాధ్యక్షుడు దబ్బా దివాకర్ లిఖిత పూర్వకంగా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యదర్శినీ కోరారు. ఈ మేరకు ఆయన స్థానిక స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమస్యలను పేర్కొని, పీసా ప్రధాన కార్యదర్శి రాంబాబుతో కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా పీసా చట్టం ఉపాధ్యక్షుడు దబ్బా దివాకర్ మాట్లాడుతూ జడ్డంగి గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి పూట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు తీవ్ర విబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు. ఇదే క్రమంలోనే ప్రస్తుత వర్ష కాలం కావడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయనీ వాటి నివారణకు పిచికారి చేయలని దివాకర్ కొరారు. ముఖ్యంగా జడ్డంగిలో జాతీయ వి.బి.జి. రామ్. జి పథకంలో రోజువారీ కార్మికులు పనిచేసిన కార్మికుల వేతనాలు సుమారు ఆరు నెలలుగా నగదు చెల్లింపులు లేక ప్రజలు తీవ్ర విబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే వి.బి.జి. రామ్.జి పథకం బకాయి చెల్లింపుల ప్రక్రియను త్వరితగతన పూర్తిచేయాలని లిఖితపూర్వకంగా ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular