
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిది
ప్రతి రైతు బాగుండాలని వారికి సకాలంలో అవసరమగు విత్తనాలు, యూరియా, సబ్సిడీ తదితర వన్ని ప్రభుత్వం అందిచడమే లక్ష్యం గా పనిచేస్తుందని పి ఏ సి ఎస్ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి అన్నారు. ఈ మేరకు మండలం లోని ఉపమాక గ్రామములో బుధవారం ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు సోదరులు పంట బీమా నమోదు చేసుకోవాలని,అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా ఖాతాల్లో డబ్బులు పడని రైతులు సంబంధిత పత్రాలు సకాలంలో మండల వ్యవసాయ అధికారికి అందిస్తే వారి ద్వారా సమస్యలు పరిష్కరించి రైతు ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మేలు చేసే కార్యక్రమం లో రాజి పడబోమని హోం మంత్రి వంగల పూడి అనిత రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు ప్రతిది తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయశాఖ అధికారి ఏవో ఉమా ప్రసాద్, మాజీ సర్పంచ్ ప్రగడ వీరబాబు, కొంకిపూడి దొరబాబు, యలమంచిలి చంద్రరావు, తోలేటి శ్రీను, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు,వ్యవసాయ శాఖ సిబ్బంది సత్యనారాయణ, రవికుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.
