చింతపల్లి జిల్లావాణీ ప్రతినిధి: భారతదేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్ ఈ ఈ టి జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్టి సెల్ చైర్మన్ రీమల నవ భరత్ చింతపల్లి స్థానిక పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ పై దాడి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని నవ భరత్ అన్నారు. పేపర్ లీకై, పున పరీక్షలు జరిగినా, శాశ్వత సంస్కరణలు ప్రకటించినా తమకు జరిగిన అన్యాయంపై సమాధానం కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చిన వేలాది మంది విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిం ది. దాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన లాఠీచార్జ్ తో ముగిసింది. ఎన్ ఈ ఈ టి లీకేజీకి నైతిక బాధ్యత వహించాలని, పారదర్శకత కావాలని ఆయన డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్దకు తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నినాదాలు చేస్తున్న విద్యార్థులపై అకస్మాత్తుగా లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు చేతులు, కాళ్లు విరిగిన వారు ఉన్నారు. తలకు దెబ్బలు తగిలిన విద్యార్థులు రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయారు. పరీక్ష కోసం రాత్రింబవళ్లు చదివిన ఆ చేతులపైనే లాఠీలు పడ్డాయి. అని ఆయన అన్నారు విద్యార్థుల ప్రశ్న మేం ఉగ్రవాదులమా బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ ఒక విద్యార్థిని ఆసుపత్రిలో కలిసినప్పుడు ఆమె కన్నీళ్లతో ఇలా అడిగింది. అయ్యా మేం డాక్టర్లు కావాలని కలలు కంటున్నాం. మా పేపర్ లీక్ అయితే ప్రశ్నించడం తప్పా? మమ్మల్ని ఉగ్రవాదుల్లా కొట్టారు. మా తప్పు ఏమిటి మరో విద్యార్థి మే 3న లీక్ అయింది. 44 రోజుల్లో రీ-ఎగ్జామ్ పెట్టారు. కానీ మా 1 సంవత్సరం కష్టం, ఫీజులు, మానసిక క్షోభకు ఎవరు బాధ్యులు? మంత్రి క్షమాపణ చెప్పారు కానీ వ్యవస్థలో ఉన్న అవినీతి పోయిందా అని ఆయన ప్రశ్నించాడు. ఎన్ ఈ ఈ టి విలువలు ఏమయ్యాయి? ఎన్ఈఈటి అంటే కేవలం ఒక పరీక్ష కాదు. ఒక పేద రైతు కొడుకు డాక్టర్ కావాలనే కల. ఒక మధ్యతరగతి అమ్మాయి కుటుంబానికి ఆశా జ్యోతి.
కానీ పేపర్ లీక్ అయ్యి, ఆ కలను దళారులు, కోచింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్టిఏ త్వరగా చర్యలు తీసుకుంది నిజమే, 13 మంది అరెస్ట్ అయ్యారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వస్తుంది నిజమే. కానీ లీక్ వల్ల నష్టపోయిన లక్షలాది విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి ఎవరు తెస్తారు. ప్రశ్నిస్తే లాఠీలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ముఖ్యంగా భవిష్యత్తును నిర్మించే విద్యార్థులకు ఉంది. కానీ జంతర్ మంతర్ లో జరిగిన లాఠీచార్జ్ ఆ హక్కునే గొంతు నులిమే ప్రయత్నంగా ఉంది. విద్యార్థులు కోరుతున్నది పెద్దదేమీ కాదు. జవాబుదారీతనం, పారదర్శకత, న్యాయం. అది ఇవ్వకుండా, అడిగిన వారిపై లాఠీలు ఝళిపించడం ఎంతవరకు సబు మేం డాక్టర్లు కావాలి. రోగులను కాపాడాలి. కానీ మమ్మల్ని కాపాడేవారే లేరు అంటున్నాయి జంతర్ మంతర్ విద్యార్థుల గాయాల గుర్తులు. నవ భరత్ ఆయన జ్ఞాపకం చేశారు ప్రజలకు ఎప్పుడు అన్యాయము జరిగిన వారి పక్షాన నిలబడి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని నవభారత్ పేర్కొన్నారు.
