కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం
జిల్లా వాణి, తుని
“అభివృద్ధి పథంలో తుని నియోజకవర్గం”
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యమని అన్ని ప్రాంతాలలోనూ మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కుటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో పోలి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి రానున్న వర్షాకాలం సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రెండేళ్ల పాలల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాల్లో ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మోత్కూరు వెంకటేష్, గవర కార్పోరేషన్ చైర్మన్ మల్ల గణేష్, మాజీ వైస్ చైర్మన్ ఆచంట సురేష్, బిజెపి నాయకులు రామకృష్ణ, జనసేన నాయకులు కనిగిరి ప్రకాష్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

