జగ్గంపేట, ఆగస్టు 3:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గోదావరి జలాలను ఏలేరు కాలువలోకి విడుదల చేసే కార్యక్రమం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, జనసేన ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వూట నానిబాబు కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి జలాలను ఏలేరు కాలువలోకి విడుదల చేశారు.ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గోదావరి జలాలను ఏలేరు కాలువ ద్వారా విడుదల చేయడంతో జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో సుమారు 53 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వేలాది మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందనున్నారని తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.గోదావరి జలాల విడుదలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయిగుణ శేఖర్, కృష్ణవరం జనసేన నాయకులు సునీల్, పాఠంశెట్టి రమేష్, కాయల మణికంఠ, పాలెం బాబీ, గుంటముక్కల చిన్న, గుంటముక్కల పెద్ద, రేవూరి శ్రీను, కొలమూరు భద్రతో పాటు కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


