పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రాజవొమ్మంగి మండలంలోని చెరుకుంపాలెం గ్రామ పంచాయతీ వైకుంఠపురంఅటవీ ప్రాంతంలోని వన దుర్గాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త స్థానిక నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ దంపతులు వన దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ వైకుంఠపురంవన దుర్గాదేవి ఆలయం భక్తులు కోరే కోరికలు తీర్చే మహిమ గల దేవత అని ఆమె కొనియాడారు. మైదానప్రాంతాలు మరియు మన్యం ప్రాంతంలోని నలుమూలల నుండి అనేకమంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కలు తీర్చుకునే ఒక విశిష్టత గల దేవాలయం అని ఆమె వాపోయారు. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు ,శ్రేయోభిలాషులతో కలిసి ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికంగా గడపటం చాలా మంచి అనుభూతిని కలిగించిందని ఎమ్మెల్యే శిరీష దేవి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, జనసేనా నాయకులు బొదిరెడ్డి త్రిమూర్తులు దంపతులు,తెలుగుదేశం పార్టీ నాయకులు గణజాల తాతారావు, జనసేన నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ కేశిరెడ్డి శివ శంకర వర ప్రసాద్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, మండల పార్టీ నాయకులు జెట్టి మధు, నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు ముప్పన సావిత్రి, ముప్పన మోహన్, చిట్టి సుబ్బారావు, వానపల్లి చిట్టిబాబు, బచ్చా బుజ్జి సత్యనారాయణ, చెక్కా లోవరాజు, చిలకచర్ల వీరబాబు, పాపోలు శ్రీనివాసరావు, కుప్పాల జయరాం, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
