ఆంధ్ర రాష్ట్ర ఇంచార్జ్ పులి ప్రసాద్ డిమాండ్
జగ్గంపేట ఆగస్టు 4 :- జగ్గంపేట లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర ప్రత్యేక వసతి గృహం హాస్టల్ ఎప్పుడు నిర్మిస్తారు అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్ర ఇన్చార్జ్ పులి ప్రసాద్ డిమాండ్ చేశారు. జగ్గంపేటలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ 1982 సంవత్సరంలో స్థాపించినారు 1984 సంవత్సరంలో ప్రారంభించినారు. ఇప్పటికీ 42 సంవత్సరాలు గడుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శిధిల అవస్థలో ఉన్నటువంటి హాస్టలను ఖాళీ చేయించి రెండు సంవత్సరాలు గడుస్తుంది హాస్టల్ ఇంటిగ్రేట్ టైపులో మూడు హాస్టల్లో కలిపి నిర్మిస్తానని స్థానిక శాసనసభ్యులు హామీ ఇచ్చినారు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా హాస్టల్ నిర్మాణం చేపట్టలేదు. దీనికి కారణం జగ్గంపేట మెయిన్ సెంటర్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉండడం ఏమిటని ఎక్కడో ఊరి చివరన చెరువులో హాస్టల్ నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్ స్థలము వాళ్ల కార్యకర్తలకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కదా వారు ఎక్కడున్నా పరవాలేదు అనే ఉద్దేశంతోటి ఈ ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగా సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి జగ్గంపేట శిథిలావస్థలో అటువంటి స్థలము మరియు హై స్కూల్ వెనుక ఉన్న స్థలము పరిశీలించి మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి స్థలాన్ని రాజకీయ నాయకులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాలుర హాస్టల్ కొరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ కేంద్ర మంత్రివర్యులు రాందాస్ అథవాలే గారి దృష్టిలో పెట్టగా 2024 -2025 వార్షిక బడ్జెట్లో హాస్టల్ నిర్మాణానికి పి యం ఎ జె ఎ వై నుండి నిధులు మంజూరు చేయించినారు. స్థానిక శాసనసభ్యులు ఇప్పటికి వాటి కొరకు మాట్లాడకుండా ఎస్సీ పిల్లలే కదా ఎక్కడున్నా ఒకటే అని చెరువు ప్రక్కన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు దీనిని వ్యతిరేకిస్తున్నాము అవసరమైతే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని పులి ప్రసాద్ అన్నారు.

