HomeAndhra Pradeshమన్యం మారుమూల ప్రాంతం లాగరాయి గ్రామంలో పోలీసు జనమైత్రి కార్యక్రమం, హాజరైన డిఎస్పి:ఆశ్రఫ్ అలీ

మన్యం మారుమూల ప్రాంతం లాగరాయి గ్రామంలో పోలీసు జనమైత్రి కార్యక్రమం, హాజరైన డిఎస్పి:ఆశ్రఫ్ అలీ

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కోసం ప్రతీ ఒక్కరూ తెలుసు కోవాలని రంపచోడవరం డిఎస్పి ఆశ్రప్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజనల్ రాజవొమ్మంగి మండల పోలీసు సర్కిల్ లోని లాగరాయి గ్రామంలో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు జనమైత్రి కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంపచోడవరం డివిజనల్ డిఎస్పి ఆశ్రఫ్ అలీ మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ వారు 1/70 చట్టం, జీవో నెంబర్ 3 కోసం చర్చిస్తారని అన్నారు.ఈకమిటీలో మన గిరిజన సంఘం నాయకులను నెంబర్లు ఉండాలని కోరారు. అనుమతులు లేని బంద్ లు, ధర్నాలకు దూరంగా ఉండాలని డి.ఎస్.పి అన్నారు. ఇదే క్రమంలో మహిళా చట్టాలు, శక్తి యాప్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, గంజాయి వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. తదనంతరం రాజవొమ్మంగి, జడ్డంగి పోలీస్ స్టేషన్లను సాధారణ తనిఖీ లలో

భాగంగా పోలీస్ స్టేషన్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హైవే పై పశువుల వలన రాత్రుల సమయాల్లో జరిగే ప్రమాదాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు రాజువమ్మంగి జడ్డంగి సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, చినబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular