అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు టీవీ రమణ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభకు హాజరైన మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీపీ వై. శ్రీనివాసరావు, మాజీ కోఆపరేటివ్ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ నక్కా రమణతో పాటు కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు రోలుగుంట మండల కేంద్రంలో ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని టీవీ రమణ పిలుపునిచ్చారు.ఇక రోలుగుంట ఎంపీపీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల వల్ల అనేక మంది యువత నష్టపోయారని పేర్కొంటూ, బాధిత విద్యార్థుల తరఫున పోరాటానికి వైసీపీ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ దీక్ష కార్యక్రమంలో యువజన విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై శ్రీనివాసరావు తోపాటు మండల పార్టీ అధ్యక్షుడు టివి రమణ మాజీ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటరమణ వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
