
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పర్యటించనున్నారని పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటలకు నక్కపల్లి మండలం లోని ఒడ్డి మెట్ట గ్రామం లో రెండేళ్ల నమ్మకం -అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం లో పాల్గొంటారని, జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ఉదయం 11 గంటలకు పాయకరావుపేట పట్టణంలో నేతన్న సేవలో కార్యక్రమం లో మంత్రి పాల్గొంటారని అనంతరం నక్కపల్లి మంత్రి నివాసం వద్ద క్లస్టర్, యూనిట్, సమన్వయకమిటీ సభ్యులు తో జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాల్ని నాయకులు, కార్యకర్తలు, అధికారులు విజయవంతం చేయాలనీ కోరారు.
