
ఎస్. రాయవరం, జిల్లావాణి ప్రతినిధి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును మండలంలోని ధర్మవరం అగ్రహారం స్వగ్రామంలో శుక్రవారం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.నక్కపల్లి మండలం గునిపూడిలో భూములను స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ నిర్వహిస్తూన్న నిరసన కార్యక్రమానికి అప్పలరాజు మద్దతు ప్రకటించారు. అక్కడికి వెళ్లడానికి వీలు లేకుండా రాష్ట్ర హోం శాఖ మంత్రి నియోజకవర్గంలో పర్యటించడం వలన ఈ గ్రృహ నిర్బంధం చేసారు. దీనిని సిపిఎం జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్ లు తీవ్రంగా ఖండించారు.
గ్రృహ నిర్బందాలతో ఉద్యమాలు ఆపలేరని,ప్రజలు పక్షాన నిరంతరం సిపిఎం పోరాడుతుందని తెలిపారు.
