
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మండల కేంద్రం లోని హోం మంత్రి నివాసం లో యూనిట్, క్లస్టర్, సమన్వయ కమిటీ సభ్యులు తో మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతతో పాటు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. టీడీపీ సిద్ధాంతం కార్యకర్తను కూడా నాయకుడిగా తీర్చిదిద్దడమేనని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.
