
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
నక్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( పి.ఎ.సి.ఎస్ ) ద్వారా రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తక్కువ వడ్డీపై తనఖా రుణాలను రైతులకు మంజూరు చేశారు. ఈ చెక్కులను సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బుజ్జి, డైరెక్టర్ లు కోసూరు శ్రీను వాసరావు, మనబాల కొండబాబు చేతులు మీదుగా శుక్రవారం రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి మాట్లాడుతూ, రైతులుకు అందిస్తున్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.కూటమి ప్రభుత్వం రైతులుకు మేలు చేసే దిశగా పనిచేస్తుందని అన్నారు. మంజూరు చేసిన
ఈ రుణాల పంపిణీ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ ఖాన్, సిబ్బంది గోవింద్, నాగేష్, వరలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
