HomeUncategorizedఅత్యంత భక్తి శ్రద్దలతో రేబాకలో ఘనంగా గూడుపమ్మవారి సారె ఊరేగింపు

అత్యంత భక్తి శ్రద్దలతో రేబాకలో ఘనంగా గూడుపమ్మవారి సారె ఊరేగింపు

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి మండలం లోని రేబాక గ్రామంలో గూడుపమ్మ అమ్మవారిని దర్శనం కొరకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఆషాడ మాసం లో అమ్మవారు ఆలయం నిత్యం భక్తులుతో కిటకిట లాడుతోంది.కోరిన కోర్కెలు తీర్చే కల్ప వల్లిగా పేరు గాంచిన అమ్మవారికి వివిధ రూపాల్లో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనిలో భాగంగా గ్రామం లో అమ్మవారికి సారే సమర్పణ, ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
రేబాక పంచాయతీ, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సారే ఊరేగింపులో మాడుగుల, కె.కోటపాడు, ఎలమంచిలి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, నాతవరం తదితర మండలాలు, రేబాక పంచాయతీ పరిధిలో మహిళలు నుంచి అమ్మవారికి సారె సమర్పించారు.
రేబాక గ్రామం నుంచి శ్రీ గూడుపమ్మవారి ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి సారే సమర్పించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో రేబాక పంచాయతీ పరిధిలోని పెద్దలు, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా, డివిజన్, మండల కమిటీ ప్రతినిధులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular