HomeUncategorizedబీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా గర్లంక శివయ్య

బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా గర్లంక శివయ్య

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి

మండలంలోని ఉద్దండపురం గ్రామానికి చెందిన గర్లంక శివయ్యను కిసాన్ మోర్చా నక్కపల్లి మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఈ మేరకు శివయ్య ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శివయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద బాధ్యత అప్పగించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సరగడం వరాహ వెంకట శంకర్రావు,బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు,బీజేపీ మండల అధ్యక్షుడు పోల్నాటి నానాజీ,బీజేపీ రాష్ట్ర నాయకులు పాకాలపాటి రవిరాజుకు శివయ్య కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కిసాన్ మోర్చా ద్వారా నిరంతరం కృషి చేస్తానన్నారు.మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు అందేలా అవగాహన కల్పిస్తానని తెలిపారు.ఉద్దండపురం గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి కిసాన్ మోర్చాను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని శివయ్య పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular