గొలుగొండ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం గ్రామంలో ఆదివారం స్వయ౦ భూ నీలకంటేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని ఆలయ ప్రాగణం భక్తులతో పోటెత్తింది భక్తుల స్వామివారిని దర్శించుకుని శివనామ స్మరణ తో మారుమోగింది భక్తులకు ఆలయ కమిటీ వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు దారమటంలో ఉమా దారం మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కటకటలాడుంది తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారు వాహనదారులకు స్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది

