
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
పాయకరావుపేట ప్రెస్ క్లబ్ పరిధిలో గల ఎస్. రాయవరం, నక్కపల్లి మండలాలకు సంబందించిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఏపీయూ డబ్ల్యూ జే 70 వ వార్షికోత్సవాలను ఘనంగా మండలం లోని అడ్డురోడ్డు కేంద్రం గా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీయూడబ్ల్యూజే వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా అడ్డు రోడ్డు రెవిన్యూ డివిజన్ కార్యాలయానికి చేరుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్కిల్ సిఐ లడ్డు రామకృష్ణ, కార్యాలయ డిటి నానాజీ , రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిఆర్ఓ బంగారు చిట్టి లతోపాటు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు ఎన్.వి సత్యనారాయణ, అధ్యక్షులు ఆచంట రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా డిప్యూటీ జిల్లా సెక్రెటరీ బీవివి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రగడ నాగ రమేష్ ల చేతుల మీదుగా పాత్రికేయులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు సీనియర్ పాత్రికేయులు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ లను సీఐ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కి యూనియన్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిఆర్ఓ బంగారు చిట్టి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రగడ నాగ రమేష్, జీవివి ప్రసాద్ ,పులుగు పెంటయ్య, పాము సత్యనారాయణ, కొల్నాటి తాతాజీ,యూనియన్ నాయకులు సేనాపతి లోవరాజు, జెర్రీ పోతుల వెంకట్, నాని, గొల్లపల్లి రాజు, శ్రీకాంత్, తోటరాజు, రామ్ కుమార్, సత్తిబాబు, కొవిరి వెంకటేష్, జోగారావు తోపాటు పలువురు ఉన్నారు.
