అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ కె. కన్నం నాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఎస్. మోహన్‌రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో కుశర్లపూడి గ్రామ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
