HomeAndhra Pradeshనేరాలు వారు చేసి నిందలు తమ పై వేశారు...?జనసేన నాయకుడు గోరపల్లి సోము నాయుడీ ఆవేదన..!!నిబద్దతతో...

నేరాలు వారు చేసి నిందలు తమ పై వేశారు…?జనసేన నాయకుడు గోరపల్లి సోము నాయుడీ ఆవేదన..!!నిబద్దతతో రాజకీయాలు చేస్తే ఇదా సత్కారం…!!!వ్యాపార కార్యకలాపాలకు, రాజకీయలు అన్వయించడం సరికాదు


జిల్లావాణి పెందుర్తి ప్రతినిధి:
నేరాలు వారు చేసి ,,నిందలు తమపై వేస్తున్నారని,,జనసేన నాయకుడు,, పెందుర్తి మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు, గోరపల్లి సోమునాయుడు పేర్కొన్నారు…విశాఖ జిల్లా పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురం లోని ఆయన స్వగృహం నందు కూటమి నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో సోమనాయుడు మాట్లాడుతూ, ఇటీవల తమపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదన్నారు…నిజాయితీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటూ,,నిబద్ధత, సేవ తర్పరత తో రాజకీయాలు చేస్తున్న , తమపై బురద జల్లడం సరికాదన్నారు…తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన భూముల నందు,, ఇటీవల ఉప్పలపాటి రాజేష్ అనే ఆసామీ రౌడీ మూకలతో దాడులు నిర్వహించి,, ఇక్కడి సన్నివేశాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు…విజయనగరం జిల్లా నందు నివాసముంటున్న అతడు ఎన్ ఆర్ ఐ గా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు…ఇదంతా తన రాజకీయ ఎదుగుదల చూడలేక, ప్రత్యర్ధులు చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొన్నారు…సమావేశంలో స్థానికుడు సోమునాయుడి బంధువు, వరుణ్ తేజ్ మాట్లాడుతూ తమకి, ఈ ఆస్తులు సంక్రమించిన విధానం, సంబంధిత స్థలంలో జరిగిన సంఘటనలను ఆధారాలతో విపులంగా వివరించారు… కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కునిగంటి కనకరాజు మాట్లాడుతూ,,వీటన్నిటిని ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడ గా అభివర్ణించారు కార్యక్రమంలో స్థానిక నాయకుడు దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular