HomeAndhra Pradeshజర్నలిస్ట్ పై దాడిని కండిస్తూ కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్

జర్నలిస్ట్ పై దాడిని కండిస్తూ కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: సమాజంలో నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న బాధ్యత గల జర్నలిస్టులపై దాడులు భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం అని పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండల అల్లూరి ప్రైస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం చట్టరీత్యా నేరం అని వారు వాపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఇటివలే ఓ పత్రిక విలేకరి పందిరిపల్లి గోవింద్ పై రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన వ్యక్తులు దారుణంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ రాజవొమ్మంగి స్థానిక పోలీసు స్టేషన్ లో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. విలేఖరి పై దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు డిమాండ్ చేస్తుంటాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సూరిబాబు మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular