
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మరో రెండు నెలల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సమిష్టి గా కృషి చేసి వంద శాతం విజయాలు నమోదు చేయాలనీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. ఈ మేరకు మండలం లోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద గల భారతి కన్వన్షన్ లో తీనార్ల మాజీ సర్పంచ్ ముసలయ్య కుమారుడు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ గొల్ల బాబురావు నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు అనంతరం పార్టీ నాయకులను కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరించి పాయకరావుపేట నియోజకవర్గం లోని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ వైస్సార్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలని అలాగే వైసిపి పై కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం లో ఎలాంటి సమస్యలు వున్నా నా ద్రుష్టికి తీసుకోని రావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
