HomeAndhra Pradeshశాసన సభ్యురాలు దృష్టికి పర్యాటక ప్రాంతామైన మరేడువాగు రోడ్డు ఎత్తు, పల్లాల సమస్య తీసుకెళ్లిన టీడీపీ...

శాసన సభ్యురాలు దృష్టికి పర్యాటక ప్రాంతామైన మరేడువాగు రోడ్డు ఎత్తు, పల్లాల సమస్య తీసుకెళ్లిన టీడీపీ శ్రేణులు, శిరీష దేవి చొరవతో రోడ్డు సమస్యకు విముక్తి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజవొమ్మంగి మండల కేంద్రం జడ్డంగి గ్రామ పంచాయతీ సమీపంలోనీ మడేరు వాగు ఆనకట్ట పరిసర ప్రాంతం రోజు రోజుకు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి దృష్టికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గణజాల తాతారావ్ తీసుకెళ్లారు. అంతేకాకుండా

తాతారావు లికిత పూర్వకంగా ఎమ్మెల్యే శిరీష దేవి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ గ్రీవెన్స్ లో ఆనకట్టకు వైపు వెళ్ళే మార్గం జాతీయ రహదారి ఎన్ హెచ్ 516ఈ రోడ్డు ఎత్తు, పల్లాలు సంబంధిత ఇబ్బందులు పర్యాటకులకు మరియు రైతులకు లేకుండా

తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ఆనకట్టకు వైపు వెళ్ళే పర్యాటకులకు మరియు రైతులకు ఎన్ హెచ్ 516 ఈ జాతీయ రహదారి వారు చూడాలని ఎమ్మెల్యే ఆదేశించిన క్రమంలో గుత్తేదారుడీనీ స్థానిక తెదేపా నేతలు గణజాల తాతారావ్ మరికొందరు కలిసి సోమవారం రోడ్డుపనులు వారే దగ్గరుండి చేయడం జరిగిందనీ తాతారావు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు గణజాల తాతారావ్ మాట్లాడుతూ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఆనకట్ట ప్రాంతంకు రోడ్ వేయడం వల్ల పర్యాటకులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ వారితో మెటల్ కూడా వెయ్యాలని కోరడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పర్యాటకంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళికలు రూపొందిస్తామని గణజాల తాతారావ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాసంశెట్టి గంగాధర్, చెక్కా పండుబాబు, చిలకచర్ల వీరబాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular