HomeUncategorizedరోలుగుంటలో త్రాగునీటి పనులకు జడ్పిటిసి నిధులు 5 లక్షలు మంజూరు.

రోలుగుంటలో త్రాగునీటి పనులకు జడ్పిటిసి నిధులు 5 లక్షలు మంజూరు.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో నెలకొన్న తాగునీటి సమస్యపై సీపీఎం, ప్రజాసంఘాలు పలుమార్లు ఆందోళనలు, విజ్ఞప్తులు చేయడంతో అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో రోలుగుంట పంచాయతీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీటీసీ పాతల లక్ష్మి రమణమ్మ చొరవతో రూ.5 లక్షల జడ్పీ సాధారణ నిధులు మంజూరైనట్లు తెలిపారు.మంజూరైన నిధులతో ఆయా కాలనీల్లో తాగునీటి సరఫరా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమేష్‌బాబు, సంబంధిత అధికారులను కోరారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular