జగ్గంపేట, ఫిబ్రవరి 24: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామానికి చెందిన వనదుర్గ మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం మల్లిసాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. పదో తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన దశ అని, దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రోత్సాహకంగా ఈ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సిద్ధమవుతున్న 71 మంది విద్యార్థిని, విద్యార్థులు. ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర అవసరమైన స్టేషనరీ సామాగ్రి. రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులంతా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తమవంతు సహాయంగా విద్యార్థులకు అండగా నిలుస్తున్న వనదుర్గ మహాపీఠం ట్రస్ట్ సేవలను గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు

