HomeUncategorizedఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి దివ్య కళ్యాణము ...

ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి దివ్య కళ్యాణము హాజరైన టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు

జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఈనెల 7 ,8 ,9 తేదీలలో జరగబోవు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మొదటిరోజు శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కళ్యాణం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరపగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ లక్ష్మీదేవి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణానికి ముఖ్యఅతిథిలుగా టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈరోజు శివ కేశవుల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా ఈ దేవస్థానము టీటీడీ ఎండోర్స్లో చేర్చుకోవడం తో ఎంతో ఆనందంగా ఉందని ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఈ శివకేశవల క్షేత్రం వద్దకు తీసుకువచ్చి కళ్యాణ నిర్వహించుకోవడం నాకు కలిగిన గొప్ప అవకాశం అని దీనికి సహకరించిన టిటిడి చైర్మన్ కు పాలక వర్గ సభ్యులకు ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని నా జీవితాశయం ఇక్కడ కోటి లింగేశ్వరుని ప్రతిష్ట చేయడం అని దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక మంది ప్రముఖులు పదివేల మంది భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. వచ్చిన వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదం లడ్డు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular