
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.ఎస్. చేతుల్మీదుగా శుభారంభం ස0යි. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా మార్చే ఈ పథకంలో ఇంటింటికీ చేరుకునే రథం పనికిరాని ప్లాస్టిక్, కాగితాలు, ఎలక్ట్రానిక్ రాజు వ్యర్ధాలు పాత వస్తువులు సహకరిస్తూవాటి తూకానికి తగ్గట్టుగా విలువ లెక్కించి నిత్యావసర సరుకులు అందిస్తుంది. కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే, కె.ఎస్. ఎన్. ఎస్. రాజు.. ‘చెత్త నుంచి సంపద సృష్టించే ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజలకు పరిశుభ్రత, ఆదాయం రెండూ తీసుకొస్తుంది. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లక్ష్యాన్ని అందరూ సాధించాలి’ అని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద, స్వచ్ఛ ఆంధ్ర పర్యావరణ పరిరక్షణ.,ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజు సీసాలు, పాత పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, నూనె డబ్బాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం, ఇంటి వద్ద వ్యర్థాలు అప్పగించి సబ్బులు, నిత్యావసరాలు పొందండి. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, తహసీల్దార్ నాగమ్మ, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఉత్సాహంగా సహకరించారు.
