అమరావతి:గాదె సాయికృష్ణ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి ఆచూకీ లేకుండా పోవడం చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేపడుతున్న విచారణపై స్టే విధించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబరు 30లోగా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 12కు వాయిదా వేసింది.సాయికృష్ణ కస్టడీలో ఉన్న సమయంలో ఏం జరిగిందన్న దానిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సీసీటీవీ రికార్డుల్లో కీలక సమయానికి సంబంధించిన ఫుటేజీ అందుబాటులో లేదని గతంలో కోర్టు రికార్డుల్లో నమోదైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి పూర్తి వివరాలను సుప్రీంకోర్టు కోరింది.
Recent Comments
on Hello world!
