కాకినాడ జిల్లా…జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గొల్లలగుంట గ్రామల రైతులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలినో వర్షపాతం తక్కువ ఉండడంతో పంటలు పండించుకోవడానికి పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నీరును కాలువలు ద్వారా తీసుకువచ్చి ఆయా చెరువుల్లో నీటిని నింపి రైతులకు ధైర్యాన్ని తెలియజేశారు అదేవిధంగా దొర చెరువులో అసలు ఈ సంవత్సరం వర్షపాతం రాకపోవడంతో కనీసం పశువులు తాగడానికి కూడా నీరు లేదని వాపోయారు తమ సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నీటిని వదిలిన కారణంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో దొర చెరువు కమిటీ రైతులు బాలనాగు. చిత్రబాబు. ములికి శివకుమార్. రాయుడు వీరబాబు. గండికోట నాగరాజు. గొల్లవిల్లి రాంబాబు. కొప్పిశెట్టి సూరిబాబు. కలిదండి రాజశేఖర్. చింతాడ రాజు. తలారి వెంకటరమణ. ధనికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

