తాడేపల్లి :గ్రేటర్ విశాఖపట్నం నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు బొత్స, కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, స్థానిక సమస్యలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చిందని, ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా విశాఖలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు ఇచ్చే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. పోలవరం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉంటే విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వగలమన్నారు. ఒకవైపు పోలవరంలో ఎత్తు తగ్గించి, 75 టీఎంసీల వరకు అదనపు నిల్వ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరోవైపు విశాఖలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని జగన్ పేర్కొన్నారు. విశాఖ భూముల విషయమై మాట్లాడుతూ రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, విశాఖపట్నంలో మాత్రం 99 పైసలకు చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇస్తున్నారు. రూ.5వేల కోట్ల విలువైన భూములను గీతం పేరుతో కబ్జా చేస్తున్నారు. విశాఖలో అత్యంత విలువైన భూములను తమకు నచ్చినవారికి ఇచ్చేసే స్థాయికి ఈ ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు
చంద్రబాబు వచ్చాకే విశాఖకు తాగునీటి సమస్య: వైఎస్ జగన్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
