అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు రూ.1,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 10 తర్వాత గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్ష ఫీజు రూ.600, ప్రాక్టికల్స్ కు రూ.275, బ్రిడ్జ్ కోర్సులకు రూ.165గా నిర్ణయించారు..
