పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కే. ఉమా పిలుపునిచ్చారు. సోమవారం రంపచోడ వరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్యవివాహ రహిత భారతదేశం జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్యాభ్యాసానికి కలిగే ఆటంకాలు, వారి ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాల్యవివాహాల నివారణ ఒక్క ప్రభుత్వ శాఖ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నిలబడాలని, బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, విద్యాభ్యాసానికి కలిగే ఆటంకాలు, వారి ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించిన: పీడీ
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
