HomeUmmadi Alluri Zillaమాదకద్రవ్యాల మూమెంట్స్ కీ చెక్ పెట్టేందుకు అను నిత్యం పోలీసుల పహారా కొనసాగుతోంది: ఎస్పీ చక్రవర్తి

మాదకద్రవ్యాల మూమెంట్స్ కీ చెక్ పెట్టేందుకు అను నిత్యం పోలీసుల పహారా కొనసాగుతోంది: ఎస్పీ చక్రవర్తి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఏజెన్సీ ప్రాంతంలో మాదకద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా పోలవరం జిల్లా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని స్థానిక జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి స్పష్టం చేశారు. జిల్లాలో నేరాలకు అలవాటుపడి జీవిస్తున్న వారి కదలికలపై నిత్యం నిగా పెట్టి వారిపే ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. జీఏడీ, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గంజాయి నేరాలకు పాల్పడుతున్న మొత్తం 25 మందిపై డిటెన్షన్ ఆర్డర్లు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మిగిలిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు కొనసాగుతు న్నాయని తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ సాగు, నిల్వ, రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని, ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా పోలీస్ అత్యవసర సేవల నంబర్ 112 కు సమాచారం అందించాలని ప్రజలకు చక్రవర్తి పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతాన్ని మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వంలో అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ తన కార్యాచరణను కొనసాగిస్తుందని జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి మీడియా సమావేశం ద్వారా ధృవీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments