HomeUmmadi Alluri Zillaఆకస్మికంగా బాలికల వసతి గృహం కలెక్టర్ తనిఖీ, భోజన నాణ్యతను పరిశీలించిన దినేష్ కుమార్,...

ఆకస్మికంగా బాలికల వసతి గృహం కలెక్టర్ తనిఖీ, భోజన నాణ్యతను పరిశీలించిన దినేష్ కుమార్, విద్యార్థిను లతో మాట మంతి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: గంగవరం మండల కేంద్రంలోని స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ గురువారం సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాలను సందర్శించి వంటకాల

తయారీ విధానం, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న అన్నం, కూరలు తదితర ఆహార పదార్థాల నాణ్యతపై వంట సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం భోజనం చేసేందుకు వరుసలో ఉన్న విద్యార్థినులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి భోజనం రుచిగా ఉంటోందా, ప్రతిరోజూ నిర్ణయించిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా, ఏయే రకాల కూరలు వడ్డిస్తున్నారు, సాయంత్రం వేళల్లో స్నాక్స్ క్రమం తప్పకుండా అందిస్తున్నారా అని ఆరా తీశారు. దీనికి విద్యార్థినులు ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం

అందిస్తున్నారని కలెక్టర్‌కు తెలియజేశారు. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, వసతి గృహంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత పాఠశాల, వసతి గృహ సిబ్బందికి కలెక్టర్ సూచించారు.అనంతరం అదే పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందిని ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ శాతం, ఓటర్ల రాకపోకలు, పోలింగ్ సరళి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments