HomeUncategorizedఉంగరం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించండి!11 హామీలతో ఇంటింటి ప్రచారం..వెలగా వెంకటకృష్ణారావు

ఉంగరం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించండి!11 హామీలతో ఇంటింటి ప్రచారం..వెలగా వెంకటకృష్ణారావు

కోటనందూరు(జిల్లా వాణి )

కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా వెలగా వెంకటకృష్ణారావును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య, మండల నాయకులు గాడి రాజబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్, నాగేశ్వరరావు, పోతల సూరిబాబు, అంకంరెడ్డి బుల్లిబాబు, దంతులూరి చిరంజీవిరాజు తదితరుల ఆధ్వర్యంలో అధిష్ఠానం ఎంపిక చేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వెలగా వెంకటకృష్ణారావు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ తాను ప్రకటించిన 11 అంశాలను కొన్ని సొంత నిధులతో, మరికొన్ని ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
11 అంశాలతో గ్రామాభివృద్ధికి హామీ
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించిన హామీలు:
1.సింహాద్రి కాలనీలో వినాయకుడి ఆలయం నిర్మాణం. 2గొల్లమంద బైలు రైతులకు ఉపయోగపడేలా కాలిబాట వంతెన ఏర్పాటు.
3 వైద్య సదుపాయం కోసం ఉచిత అంబులెన్స్ ఏర్పాటు.
4.మహిళల కోసం ఉచిత ఎలక్ట్రికల్ ఆటో ఏర్పాటు 5.యువత విద్యా వికాసానికి లైబ్రరీ, స్టడీ రూమ్ ఏర్పాటు.
6.గ్రామ భద్రత కోసం ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు.
7.పేదల కోసం టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు.
8.గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం.
9.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు. 10.క్రీడా ప్రాంగణాల ఏర్పాటు.
11.స్మశానవాటికలు,వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధితో పాటు వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం.
గడపగడపకు ఘన స్వాగతం

గ్రామంలో ఎక్కడ చూసినా ప్రతి గడప వద్ద ప్రజలు వెలగా వెంకటకృష్ణారావుకు స్వాగతం పలుకుతున్నారు. గతంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ “మా ఓటు నీకే” అంటూ ఉంగరం గుర్తుకు మద్దతు ప్రకటిస్తున్నారు. జై జై నినాదాలతో ప్రచారానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఉంగరం గుర్తుపై ఓటు వేసి వెలగా వెంకటకృష్ణారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమాజ సేవకుడు, సంపన్నుడు, మేధావి అయిన ఆయనను ఎన్నుకుంటే గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కోటనందూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments