కాకినాడ జిల్లా, జగ్గంపేట : రెండో విడత ఎన్నికలు జగ్గంపేట మండలంలో ప్రశాంతంగా జరుగుతున్నాయని పెద్దాపురం ఆర్డీఓ పి కృష్ణమూర్తి తెలిపారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. మూడో విడత ఎన్నికలు ప్రత్తిపాడు, తుని ఏరియాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ పి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

