HomeCrimeప్రమాద వశాత్తూ ద్విచక్ర వాహనం పై నుండి వంతెన కింద పడి ఆర్ఎంపీ డాక్టర్ అక్కడికక్కడే...

ప్రమాద వశాత్తూ ద్విచక్ర వాహనం పై నుండి వంతెన కింద పడి ఆర్ఎంపీ డాక్టర్ అక్కడికక్కడే మృతి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండల పరిధిలోని ఏటిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 516 ఈ వంతెన పై నుండి కిందకు సుమారు 30, 40 అడుగుల కింద చెట్ల పొదల్లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడం బొంకు థామస్ బాబు అనే ప్రైవేట్ ఆర్ ఎమ్ పీ డాక్టర్ ఆక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల ప్రకారం వృత్తి రీత్యా ఆర్ ఎమ్ పీ డాక్టర్ కావడంతో గ్రామాల్లో తనఆయన విధులను పూర్తి చేసుకుని ఎప్పటిలానే తన ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి యథావిధిగా ఇంటికి వెళుతున్న క్రమంలో ఆయన వాహనం అదుపుతప్పి రోడ్డు పై నుండి కిందకు 30, 40 అడుగుల లోయలోకి

కిందకు పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రోజువారీ వైద్య సేవలు చేయడానికి ఊరూరా తిరిగితేనెగాని పూట గడవని పరిస్థితి ఆయనది, ఆయనకు భార్య ఇద్దరు కుమారులు మృతి వార్త తెలుసుకొని బోరున విలపిస్తున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచుకొడుతున్న వర్షాల నేపథ్యంలో ఆయనకు రోడ్డు పూర్తి స్థాయిలో కనిపించకాపోవడం మరి ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా భద్రతా రక్షణ ఐరన్ కడ్డీలు లేకపోవడంతో నేరుగా 30,40 అడుగుల కింద పడి మృతి చెందారాని, కనీసం రోడ్డుకు ఇరువైపులా రక్షణ ఐరన్ కడ్డీలు ఉండి ఉండే దెబ్బలు తగిలి ప్రాణప్రాయం లేకుండా ఉండునని బందువులు వాపోతున్నారు. ఆర్ ఎమ్ పీ డాక్టర్ బొంకు థామస్ మృతి వార్తతో సొంత గ్రామం జడ్డంగిలో విషాద ఛాయల అలుముకున్నాయి. తండ్రి కోల్పోయిన పిల్లలను, ఆయన భార్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments