HomeUncategorizedభారీ వర్షాన్ని సైతం లెక్కచేయక లారీ యూనియన్ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా భారీ అన్నదానం

భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక లారీ యూనియన్ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా భారీ అన్నదానం

జగ్గంపేట (జిల్లా వాణి ప్రతినిధి):
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని లారీ ఓనర్స్ కల్చరల్ భవనంలో లారీ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తుల ఉత్సాహానికి, నిర్వాహకుల దీక్షకు అది అడ్డుకాలేకపోయింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… 1982లో ప్రారంభమైన తమ లారీ యూనియన్ ఆధ్వర్యంలో గత నాలుగు పదుల కాలంగా ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటికేడు భక్తుల సంఖ్య మరియు కార్యక్రమ పరిమాణం పెరుగుతోందే తప్ప ఎన్నడూ తగ్గలేదని, ఏటా వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేయడం తమకు ఎంతో తృప్తినిస్తుందని పేర్కొన్నారు.
​కేవలం ధార్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, లారీ వృత్తిలో ఉన్న కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు ప్రమాదాలకు గురైతే తమ యూనియన్ ద్వారా తక్షణ సహాయం అందిస్తూ వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని లారీ యూనియన్ నాయకులు వెల్లడించారు. ఎంతటి ప్రతికూల వాతావరణం, భారీ వర్షం ఉన్నప్పటికీ భక్తుల సహకారంతో అన్నసమారాధన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ ప్రెసిడెంట్ దవులూరి ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎం కె వి రాజు, కోశాధికారి మూరిశెట్టి గణేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజులతో పాటు మూరిశెట్టి రాధాకృష్ణ, సుంకర శ్రీనివాసరావు, గండి చక్రధర రావు, బి. ఆంజనేయ రాజు, పులవర్తి శ్రీనివాసరావు, జే. సురేష్ కుమార్ మరియు ఇతర యూనియన్ సభ్యులు, ప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments