Thursday, April 16, 2026
HomeUncategorizedరావులపాలెంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రావులపాలెంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రావులపాలెం జిల్లా వాణి కోనసీమ ప్రతినిధి

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోని జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి వారిని సత్కరించారు. సమాజ సేవలో భాగంగా జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రావులపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి సలాది రామకృష్ణ కూన సూర్య ప్రకాష్ జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular