HomeUmmadi Alluri Zillaజిల్లాలో 46,076 వేలమంది లబ్ధిదారులకు రూ.19.39 కోట్ల రూ.. పెన్షన్ల పంపిణీకి అన్ని...

జిల్లాలో 46,076 వేలమంది లబ్ధిదారులకు రూ.19.39 కోట్ల రూ.. పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్: కె దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకు నవంబర్ 30వ తేదీన పెన్షన్ నగదును ఉపసంహరించు కోవడంతో పాటు నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 46,076 మంది లబ్ధిదారులకు రూ.19,39,42,000 (రూ.19.39 కోట్లు) పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద సాధారణ పెన్షన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు, దివ్యాంగుల పెన్షన్లను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచిన మేరకు అర్హులకు పెన్షన్లు అంద జేయనున్నట్లు తెలిపారు. పూర్తి వైకల్యంతో మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి నెలకు రూ.15,000 చొప్పున, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులు, సికిల్ సెల్, తలసేమియా బాధితులకు వారి అర్హతను బట్టి నిర్దేశించిన పెన్షన్ మొత్తాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.ఇప్పటికే ఉన్న అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ మొత్తాల్లో ఎలాంటి మార్పులు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్ నగదును ఉపసంహరించు కోవడానికి, తరలించడానికి అధికారికంగా అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే అర్హులని, నగదు మొత్తం, పంపిణీ ఉద్దేశ్యం, సంబంధిత గ్రామం పేరును స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని, నగదు దుర్వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు సంబంధిత ఎంపీడీవోలు, గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, డీఆర్‌డీఏ–సెర్ప్ అధికారులు, బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితులు, ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments