HomeAndhra Pradeshరంపచోడవరం మహిళా సమాఖ్య ప్రధాన కేంద్రంలో వెదురు మొక్కలు పంపిణీ

రంపచోడవరం మహిళా సమాఖ్య ప్రధాన కేంద్రంలో వెదురు మొక్కలు పంపిణీ

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి:పోలవరం జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు వెదురు సాగు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రంపచోడవరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో కలెక్టర్ కె.దినేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్లె సునీత వెదురు మొక్కలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా రైతులు వెదురు సాగును ప్రోత్సహించు కోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడు తుందని ఆయన అన్నారు . వెదురు సాగుకు ఉన్న అవకాశాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.మహిళా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.వెదురు మొక్కల పెంపకం, సంరక్షణ,సాగు విధానాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారుల ను ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీకి ఎంత పేరు వచ్చిందో అదేవిధంగా మన పోలవరం జిల్లాలోని వెదురుకు మంచి పేరు వచ్చే విధంగా మహిళ రైతులందరూ వెదురు మొక్కల సాగు చేయాలని ఆయన అన్నారు. మన దేశంలోనే పోలవరం జిల్లాలో వెదురు ఎక్కువగా ఉందని ఈ వెదురును మనం ఉపయోగించగలగ పోతున్నామని ఇకనుండి ఈ ప్రాంతంలోని వెదురును ఉపయోగించుకునే విధంగా తగుచర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. వెదురుతో అగరవత్తులు, వెదురు ఫర్నిచర్లు, కొన్ని ప్రాంతాలలో వెదురుతో ఎయిర్పోర్ట్లు కూడా ఫర్నిచర్లు నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. వెదురు రెండు రకాలైనవి ఉంటాయని ఆయన అన్నారు.37 సెంట్లు 60 వెదురు మొక్కలు నాటిన ఎడల మొదటి నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ముందుగా 35 వేల రూపాయలు ఆదాయం వస్తుందని సంవత్సరం సంవత్సరం 40 సంవత్సరాల వరకు ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో పదివేల మంది రైతుల టార్గెట్ కు7484 మంది గిరిజన మహిళ రైతులకు 2,769.08 ఎకరాలలో వెదురు మొక్కలు నాటే విధంగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతము 7484 వెదురు మొక్కల సాగు కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.వెదురు మొక్కలు వేసుకున్న రైతులు మూడు నుండి నాలుగు సంవత్సరాల పాటు మొక్కలను కాపాడుకున్న ఎడల 40 సంవత్సరాల పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. వెదురు మొక్కలు వేసుకునే రైతులకు అవగాహన కొరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. వెదురు ద్వారా వివిధ రకాలైన ఫర్నిచర్ తయారు చేయుటకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అదేవిధంగా వెదురు ఉత్పత్తి చేసి ఈ ప్రాంత చరిత్ర మార్చే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలోని వెదురు మొక్కలు నాటే మహిళా రైతులకు రెండు సంవత్సరాల పాటు 37 సెంట్లు వెదురు మొక్కలు కాపాడుకునే,సాగు చేసుకొనే విధంగా నరేగా ద్వారా 34 వేల 7 వందల 75 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాకినాడలోని పెద్ద కంపెనీలు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వెదురు కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. రంపచోడవరం శాసనసభ్యులు శిరీష దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. భూములు ఉన్న ప్రతి గిరిజన

మహిళ రైతులు వెదురు సాగు చేసి 40 సంవత్సరాల పాటు మీ మీ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ వెదురు సాగు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. పోలవరం జిల్లాలోని మహిళలు అంతర్ పంటలు వేయాలని ఆమె అన్నారు.

వెదురు సాగు చేసే రైతులందరికీ ఎక్కడికి అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె అన్నారు. మహిళల అభివృద్ధికి మహిళా సంఘాలకు శ్రీనిధికి సుమారు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కొరకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు.ప్రతి మహిళా తీసుకున్న రుణములు సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు తీసుకోవాలని ఆమె అన్నారు. పోలవరం జిల్లాలోని మహిళా సంఘాలు వివిధ రంగాలలో అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయుటకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు. పోలవరం జిల్లాలోని జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ద్వారా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం జీడిపిక్కలు కొనుగోలు చేయుటకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు. అదేవిధంగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా మహిళ రైతులకు వెదురు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular