పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రాజవొమ్మంగి మండలంలో ఆ పార్టీ మండల ప్రెసిడెంట్ నేతృత్వంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రెండేళ్ల కాలంలో తమ

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల ఎన్నికల హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల మనలను పొందుతూ ఉందని పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన మండల పరిధిలోని ముర్లవానిపాలెం, జడ్డంగి గ్రామాల్లో సోమవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంను గొల్లపూడి పెద్దిరాజు చేపట్టి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పెంచి అందిస్తున్నా చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలోని రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం, అన్నక్యాంటీన్ లు ద్వారా 5రూ. లకే భోజనం, దీపం

పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకు తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం, ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అర్హులైన లబీజాల అందరికీ మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదును అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిరాజు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మండల టిడిపి పార్టీ నేతలు సూరిశెట్టి సురేష్, జెట్టి మధుశేఖర్, కాళ్ళకూరి సుందరం, వానపల్లి చిట్టిబాబు, చెక్కా లోవరాజు, పార్టీ శ్రేణులు తదితరులు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పెద్దిరాజు వెంట ఉన్నారు.
