HomeUncategorizedప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రోలుగుంటలో భారీ అవగాహన ర్యాలీ.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రోలుగుంటలో భారీ అవగాహన ర్యాలీ.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ కె.వి. శ్రావణి ప్రారంభించి, జనాభా నియంత్రణ, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనెల జులై 11 నుంచి 17 వరకు మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ కృష్ణ, హెల్త్ సూపర్వైజర్ షాజహాన్, హెల్త్ విజిటర్ వరహాలమ్మ, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular