
చింతపల్లి జిల్లావాణి ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా తాజంగి కేజీబీవీ పాఠశాలలో బుధవారం జరిగిన వరల్డ్ యూత్ స్కిల్ డే వేడుకలో ప్రధానోపాధ్యాయురాలు కె పద్మ అధ్యక్షతగా వృత్తి విద్యా అధ్యపకురాలు ఎం నీలిమ స్కిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధ్యార్హులకు చిత్రలేకనాం క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు కె పద్మ మాట్లాడుతూ విద్యార్థులో నైపుణ్యం భవిష్యత్తు లోవృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించి స్వయం ఉపాధికి మార్గం సుగమం అవుతుందన్నారు అనంతరం పోటీల్లో పాల్గొన్న విధ్యరులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
