HomeUncategorizedఎం ఎల్ ఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికల పార్టీ...

ఎం ఎల్ ఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికల పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే

అనకాపల్లి జిల్లా.. ఎలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం ఎస్‌టిబిఎల్‌లోని ఎలమంచిలి నియోజకవర్గం.ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నివాసంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండలం అప్పరాయుడుపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. వారికి ఎలమంచిలి నియోజకవర్గ.ఎమ్మెల్యే విజయ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే . మాట్లాడుతూ, ప్రజలు గట్టి తీర్పు ఇచ్చినా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అహంకార ధోరణి కారణంగానే ప్రజలు వైసీపీని తిరస్కరించారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వైపు వస్తున్నారని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు. జగన్ విధానాల కారణంగానే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular