ఎస్.రాయవరం, జిల్లావాణి ప్రతినిధి:
మండలంలోని ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఉపాధి కూలీలకు గత ఆరు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
కూలీల యొక్క ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పనులు ప్రారంభించే వరకూ కూలీలకు పనులు కల్పించాలని, రోజు వేతనం ఆరువందల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఉపాధి పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి.సాయికుమార్,బి.దుర్గాప్రసాద్,కె.శేఖర్, ఎస్.పవన్ తదితరులు పాల్గొన్నారు.
