గ్రామపంచాయతీ కార్మికుల జీతం బకాయిలు చెల్లించాలి.. రోలుగుంటలో వినూత్న నిరసన…. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గ్రామపంచాయతీలో కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలని స్థానిక మండల కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో రోడ్లు తుడుస్తూ వినూత్న నిరసన తెలియజేసి వినతి పత్రం అందించారు. రోలుగుంట మండలంలో గ్రామపంచాయతీలకు మూడు నెలల నుండి 8 నెలల వరకు జీతం బకాయిలు ఉన్నాయని బకాయి జీతాలు లేక గ్రామపంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని. ఇచ్చే జీతం 3000 నుండి 8000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని నేలలు తరబడి బకాయిలు ఉండడం వలన గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని. గత సంవత్సరం గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్లకు హెల్త్ అలవెన్స్ కింద నేలకు 4000 రూపాయలు ఇవ్వాలని కమిషనర్ సర్కులర్ ఇచ్చారని ఇది అన్ని పంచాయితీలలో అమలు కావడం లేదని. పంచాయతీ కార్మికులకు యూనిఫాం సభ్యులు తువాళ్లు చెప్పులు కొబ్బరి నూనె గ్లౌజులు అంటే సౌకర్యాలు కల్పించాలని వీటిని పంచాయితీలు అమలు కావడం లేదని. తక్షణమే జీతం బకాయిలు చెల్లించకపోతే పనులు బంద్ చేసి నిరసన తెలియజేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు మారుమూల గ్రామాల్లో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచి గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేస్తున్న గ్రామాల్లో మాత్రం జీతాలు లేక అల్లాడుతున్నారని. అతి తక్కువ జీతంతోటి పనిచేస్తున్నాడు దేశంలో గ్రామ పంచాయతీ కార్మికులనని రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతి పంచాయతీ కార్మికుడికి నెలకు 4000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని సర్కులర్ జారీ చేశారని ఈ సర్కులర్ నిధులు కొరత పేరుతోటి ఎక్కడ అమలు చేయడం లేదని నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత అధికారులుదని పంచాయతీ కేంద్రాల్లో ప్రభుత్వ బిల్డింగులు లక్షల ఐదు రూపాయలు పన్నులు చెల్లించకుండా ఉన్నాయని వీటన్నిటి వలన పంచాయితీలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కావున జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు కొల్లా వివక్షత పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి సంఘం నాయకులు అర్జున్, శ్రీనివాసరావు రాజు, సత్తిబాబు తదితరులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
