HomeUncategorizedపాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణి

పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణి

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి

మండలంలో దోసలపాడు ప్రాధమిక పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులు ఎమ్.చిన్నారావు ఆధ్వర్యంలో ఎస్.వి.వి.ఎమ్. కోఆపరేటీవ్ సొసైటీ వారి దాతృత్వంతో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బి.జే.పి.కార్యదర్శి పక్కుర్తి అప్పలరాజు చేతులమీదుగా పంపిణీచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరా మల్టీపర్పస్ మ్యూచువల్ కో ఆపరేటీవ్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని దీనిలో భాగంగాప్రధానోపాధ్యాయులు ఎమ్.చిన్నారావు కోరిక మేరకు పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. పాఠశాల అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు భానుమతి,గ్రామపెద్దలు నమ్మి అప్పలరాజు,దేవి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular