HomeAndhra Pradeshవాసుపల్లి కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

వాసుపల్లి కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

విశాఖపట్నం,జిల్లావాణి ప్రతినిధి:నగరంలోని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు, అభిమానులు వాసుపల్లి గణేష్ కుమార్ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, మహిళల రక్షణ, సాధికారత కోసం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. రాఖీ పౌర్ణమి సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు.
ఈ వేడుకల్లో రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వాసుపల్లి కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్ పద్మనాభ అమ్మాజీ, పత్చిరిపిళ్లి లక్ష్మి, స్టేట్ మహిళా విభాగం సెక్రెటరీ షబీర బేగం, స్టేట్ అంగన్వాడి వింగ్ జనరల్ సెక్రెటరీ సలాది భాను,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ, సౌత్ వాలంటరీ విభాగం ప్రెసిడెంట్ కడవల నాగమణి,జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ నీలపు లక్ష్మి,వార్డ్ మహిళా ప్రెసిడెంట్స్ చెలపల్లి జ్యోతి, రోజా, రమణి,గాలి పార్వతి,వలిశెట్టి లక్ష్మి, ఝాన్సీ, అన్నపూర్ణ నాయిర్,చుక్కా ఈశ్వరి, కోసేట్టి దేవి,మణి, మీనా, బుర్రలు అరుణా,జ్యోతి దక్షిణ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షుల మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనీ వాసుపల్లి కి హారతులిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular