HomeUncategorizedనర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం.

నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం .నాతవరం మండలంలో చమ్మచింత కురువాడ గ్రామాలలో లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ లో భాగంగా 300 ఇళ్లలో సోదాలు చేశారు.సరైన పత్రాలు లేని 35 బైకులు, ఒక ఆటో మరియు 25 మద్యం బెల్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సూచన మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించామని సిఐ రేవతమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆదేశాల మేరకు చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా భారీ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ ఆపరేషన్ లో నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం,కేడీపేట ఎస్సై ల తో పాటు టౌన్ ఎస్ఐలు సిఐ 60 మంది తమ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular